* ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయానికి రావడంతో ఘటన
* కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో
ఆకేరు న్యూస్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(PRATHIK JAIN).. అనూహ్య ఘటనను ఎదుర్కొన్నారు. గ్రామస్తుల దాడితో ఆందోళనకు గురయ్యారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో భారీ ఫార్మాసిటీ(PHARMACITY) ఏర్పాటుకు ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది. ఈమేరకు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామానికి వెళ్లారు. కలెక్టర్ గో బ్యాక్(COLLECTOR GO BACK) అంటూ రైతులు నినాదాలు చేశారు. ప్రతీక్ జైన్ వెనక్కి పోవాలని ధర్నా చేశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా దాడికి యత్నించారు. ఆపీసర్ల వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని నినాదాలు చేశారు. పోలీసులు అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచీ ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు(FORMERS) వ్యతిరేకిస్తున్నారు.
…………………………….