
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హుజురాబాద్ : చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని సాగునీటి అధికారులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని,వెంటనే సాగునీటిని విడుదల చేయాలని సాగునీటి ప్రత్యేక అధికారి ప్రశాంత్ కె పాటిల్, చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ లను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.కల్వల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనీ ప్రాజెక్టు పూర్తయితే వీణవంక మండలంలో 6,000–7,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ,సాగు నీటి సమస్య ఉన్న కమలాపూర్ మండలంలోని పలు గ్రామాలకు డిబిఎం 20,21, 22, 23, 24 ద్వారా సాగునీరు అందించాలని ,అలాగే 29 ఎల్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలకు సాగునీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.
……………………………………………….