![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-1-7.jpg)
* ఏడుగురు హైదరాబాద్‌వాసులు దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా(Kumbh mela)కు వెళ్లొస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్‌లోని సిహోరా దగ్గర మినీ బస్సును భారీ సిమెంట్ ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad)నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. చనిపో్యిన వారు హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్రనగర్ వాసులుగా తెలుస్తోంది. నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. మొత్తం మూడు బస్సుల్లో కుంభమేళాకు యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14మంది ప్రయాణికులు ఉన్నారు.
………………………………