* ట్రోఫీ కైవసం చేసుకున్న ఫాతిమా భాష్
* టాప్ 12 లో చోటు కోల్పోయిన భారతీయ భామ
ఆకేరు న్యూస్, డెస్క్ : మిస్ యూనివర్స్ – 2025 పోటీలు అంగరంగ వైభవంగా థాయిలాండ్లో జరిగాయి. భారతీయ కాలమానం ప్రకారం.. ఈ రోజు ఉదయం 6.30 గంటలకు పోటీలు ప్రారంభమయ్యాయి. విశ్వ సుందరి కిరీటం కోసం అందమైన భామలు పోటీ పడ్డారు. తమ ప్రతిభకు పదును పెట్టారు. హోరీహోరీగా పోటీ లో మిస్ యూనివర్స్ – 2025 కిరిటీం మెక్సికోకు చెందిన అందాల భామ ఫాతిమా భాష్ గెలుచుకున్నారు. ఆమె 100 మందికి పైగా పోటీదారులను ఓడించి విశ్వ విజేతగా నిలిచారు. 74వ మిస్ యూనివర్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. థాయిలాండ్ కు చెందిన ప్రవీణార్ సింగ్ రన్నరప్ గా నిలిచారు. 73వ మిస్ యూనివర్స్ గా 2024లో విజేతగా నిలిచిన డెన్మార్క్ కు చెందిన విక్టోరియా క్జార్ థెయిల్విగ్ పోటీల అనంతరం ప్రస్తుత విజేతకు టోపీని బహూకరించారు. ఫైనల్ పోటీలలో చిలీ, కొలంబియా, క్యూబా, గ్వాడెలోప్, మెక్సికో, ప్యూర్టోరికో, వెనిజులా, చైనా, ఫిలిప్సీన్స్, థాయిలాండ్, మాల్టా వంటి దేశాలు విపరీతంగా పోటీ పడ్డాయి.
అందరి దృష్టినీ ఆకర్షించిన మణికా..
విశ్వ సుందరి పోటీల్లో భారతీయ వనిత ఫైనల్ కు చేరుకోవడం.. గ్రాండ్ ఫినాలే నేడు తన టాలెంట్ ప్రదర్శిస్తుండడం ఆసక్తిగా మారింది. దీంతో కిరీటాన్ని సొంతం చేసుకుంటుందా అని భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఫినాలేకు చేరిన అందాల భామల్లో ఇండియా నుంచి మణికా విశ్వకర్మ ఉన్నారు. ఆమె 2025 ఆగస్టు 18న ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటాన్ని గెలుచుకున్నారు. మణికా రాజస్థాన్లోని గంగానగర్ నుండి వచ్చి, జైపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ‘మిస్ యూనివర్స్ ఇండియా ‘గా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీల ప్రిలిమినరీ రౌండ్లో ఆమె తన ఎరుపు రంగు గౌనుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఎరుపు రంగు, ఆభరణాలు పొదిగిన గౌను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
పోటీలో 130 దేశాలు..
మిస్ యూనివర్స్ పోటీల్లో 130 దేశాలకు చెందిన గ్లామర్ మోడల్స్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. 19 రోజులుగా వీరంతా వివిధ రౌండ్లలో సత్తా చాటుతూ, ఇంటర్వ్యూలలో జడ్జీల హృదయాలు గెలుచుకుంటూ కొంతమంది మాత్రమే ఫైనల్స్ కి చేరుకున్నారు. ఇండియా తరపున రాజస్థాన్ కి చెందిన మణిక విశ్వకర్మ ఫైనల్స్ కి చేరుకున్నారు. ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ ఆమె గెలిస్తే.. ఆ ఘనత సాధించిన నాల్గవ భారతీయ మహిళగా మణిక చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది. అయితే చివరకు నిరాశే మిగిలింది.
