* విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
* రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు
* భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక
ఆకేరు న్యూస్, హన్మకొండ : రాష్ట్రంలో పెండిరగ్లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని.. అదేవిధంగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ డిఎమ్ఎస్ఏ, టిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడిరచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లుగా 6,500 కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ మరియు ఆరేళ్లుగా సుమారు 8 వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెండిరగ్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం వల్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యా రంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తుందన్నారు. రుణమాఫీ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం విద్యార్థుల బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది నెలలుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. హైడ్రా కోసం వందల కోట్లు కేటాయించే ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఫీజు రియింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల యాజమాన్యం విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయాల్సి వస్తుందని, దానివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేసి.. విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. లేదంటే విద్యార్థి సంఘాల నాయకులం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎమ్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్, టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్, వంశీ, ఠాగూర్, కలాం, మల్లేష్, జీవన్, దామోదర్ విద్యార్థులు పాల్గొన్నారు.
……………………………..