ఆకేరున్యూస్, నల్గొండ : నల్గొండ (Nalgonda) జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మిర్యాలగూడ షాబునగర్లో మురికికాలవలో గర్భస్థ ఆడశిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని మురికికాలవ(sewarage drain)లో పడేశారు. శిశువు వయసు సుమారు 6 నెలలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతుంటే ఇలాంటి దారుణ ఘటనకు ఎలా పాల్పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పడేశారు.. ఎవరు పడేశారు.. కారణాలేంటి.. అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………….

