* కేసు దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు ను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఆ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొని యువత ఎక్కువ మంది ఈ యాప్ పట్ల ఆకర్షితులయ్యేందుకు కారణం అయ్యారంటూ పలువురు సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. గత శనివారం సినీ హీరో దగ్గుబాటి రానా ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. ఈరోజు అమృత చౌదరి, నిధి అగర్వాల్, శ్రీముఖి కాసేపటి క్రితం సిట్ కార్యాలయానికి విచ్చేశారు. ఇప్పటికే విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్ కూడా సిట్ విచారణను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైనా విచారణ చేశారు.
