* ఏపీలో ఆ దిశగా జీవో తెస్తాం
* సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రి దుర్గేష్ సమావేశం
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలోని సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు చర్చించారు. ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. టికెట్ల రేట్లు ఒకేలా ఉండేలా జీవో తీసుకొస్తామని మంత్రి చెప్పారు. పెద్ద సినిమాలు, ఆర్టిస్టుల పారితోషికంపైనా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామన్నారు. సమావేశం అనంతరం దర్వకుడు తేజ మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరల కంటే.. థియేటర్లలో పాప్ కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
……………………………………………………….

