* ఇందిరాగాంధీపై తప్పుడు ప్రచారాలు తగవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశాన్ని విభజించి లబ్ది పొందాలని చూస్తున్న వారు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ సినిమా ద్వారా నటి కంగనా రౌత్ అదే చేశారని మండిపడ్డారు. 2025 జనవరిలో ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. దేశ చరిత్రపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారని కంగనా రనౌత్‌ను భట్టి విక్రమార్క హెచ్చరించారు. మంగళవారం గాంధీ భవన్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మల్లు భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు. అందరు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. దేశ సుస్థిరత కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన ఘనత ఉక్కు మహిళ ఇందిరా గాంధీది అని గుర్తుచేశారు.
……………………………………………….