* బడ్జెట్లో వరాల జల్లు.. ప్రత్యేక సాయం ప్రకటన
* రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయింపు
* అవసరాన్ని బట్టి నిధులు పెంచుతామని వెల్లడి
* పోలవరం త్వరగా పూర్తి చేసేలా చర్యలు
* రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులు
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఫోకస్
* ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న నిర్మలమ్మ
ఆకేరు న్యూస్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ 2024-25లో ఏపీ ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmalamma) గుడ్ న్యూస్ (Good news) చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతూ వరాల జల్లు కురిపించారు. రాజధాని అమరావతి (Capital is Amaravati) నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి ఆ నిధుల పెంపునకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. రాయలసీమ (Rayalaseema), ఉత్తరాంధ్ర (Uttarandhra), ప్రకాశం (Prakasam) అభివృద్ధికి ప్రత్యేక నిధులు (Special funds) అందిస్తామని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని, చట్టం ప్రకారం ప్రత్యేక సాయం అందిస్తామని పార్లమెంట్లో ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్టణం-చెన్నయ్, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అమరావతి నిర్మానానికి ఫైనాన్స్ సంస్థల ద్వారా మరిన్ని నిధులను కల్పిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తామని, జాతీయ ఆహారభద్రతకు పోలవరం ఎంతో కీలకమని నిర్మలమ్మ వెల్లడించారు.
————————-