
*28 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశం
ఆకేరు న్యూస్ డెస్క్ : ముచ్చటపడి మల్లెపూలను బ్యాగ్ లో పెట్టుకున్నందుకు ముచ్చెమటలు పట్టించారు ఎయిర్ పోర్టు అధికారులు. ఏకంగా 1.14 లక్షల జరిమానా విధించారు.వివరాల్లోకి వెళితే.. మలయాళీలు ఓనం పండగను ఆడంబరంగా జరుపుకుంటారు.ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఓనం పండగను అట్టహాసంగా జరుపుకుంటారు.ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది. ఈ వేడకల్లో పాల్గొనేందుకు తాజాగా నటి నవ్య నాయర్ (NAVYA NAYAR) ఆస్ట్రేలియా వెళ్లారు. ఓనం పండగ సందర్భంగా వెళ్తూ వెళ్తూ ఆమె తన హ్యాంగ్ బ్యాగ్ లో 15 సెంటీ మీటర్ల మల్లెపూల దండను తీసుకెళ్లింది. ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టు సెక్యూరిటీ నిబంధనల మేరకు హ్యాండ్ బ్యాగ్ లో ఎలాంటి పూలను తీసుకెళ్లరాదు.. విషయం తెలియని మలయాళీ నటి నవ్య నాయర్ తన బ్యాగ్ లో మల్లెపూలు (JASMINE) తీసుకెళ్లింది..దీంతో మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (MELBORNE INTERNATIONAL AIRPORT) అధికారులు ఆమెను ఆపి, మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్ విధించారు. దీంతో షాక్ కు గురైన నవ్య నాయర్ ఈ విషయం తనకు తెలియదని ఎయిర్ట్ అధికారులకు వివరణ ఇచ్చింది. దీంతో శాంతించిన ఎయిర్ పోర్టు అధికారులు రూ. 1.14 లక్షల ఫైన్‌ను 28 రోజుల లోపు చెల్లించాలని షరతు విధించారు. ఎట్టకేలకు ఈ మలయాలీ భామ బతుకుజీవుడా అంటూ బయటపడింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
…………………………………….