
* మృతుల్లో బాలుడు, వృద్దురాలు
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో అగ్ని ప్రమాదం (Fire Accidents) సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తల్లాడ మండలంలో రాత్రి గ్యాస్ లీక్ (Gas Leak) కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గుత్తికొండ వినోద్ (28), చెల్లెల కుమార్తెలు ప్రిన్సి (9), లింసీ (5), ఇద్దరూ వేసవి సెలవులు కావడంతో మేనమామ ఇంటికి వచ్చారు. వినోద్ తల్లి సుశీల (70), పెద్ద కుమారుడు తరుణ్ (8), వరుణ్ (8) ఇద్దరూ కవలలు. వేసవి సెలవులు కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. గ్యాస్ అయిపోవడంతో వేరే సిలిండర్‌కు గ్యాస్ బిగించే క్రమంలో లీక్ అయి మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలపాలై పరిస్థితి విషమించడంతో వినోద్ చిన్న కుమారుడు వరుణ్, తల్లి సుశీల మృతి చెందారు. సరుకులు కొనడానికి బయటకు వెళ్లడంతో వినోద్ భార్య రేవంతి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
……………………………………………..