* భారీ ఆస్తి నష్టం
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మరిపెడలోని బార్ అండ్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. బార్ లోప ఫర్నిచర్, ఏసీలు, మద్యం బాటిళ్లు ఉండడంతో మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో రెస్టారెంట్ అంతా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పక్క దుకాణాలకు వ్యాపించకుండా నియంత్రించగలిగారు. ప్రమాదం లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

