బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో
* సల్మాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కాల్పలు ( Firing ) జరిపారు. ముంబాయిలో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. బాంద్రాలోని సల్మాన్ నివాసం గెలాక్సి అపార్ట్మెంట్ వద్ద ఈ ఘటన ఆదివారం ఉదయం 5 గంటలకు చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న ముంబాయి క్రెం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన జరిగిన తీరు, కాల్పులకు కారకులెవ్వరూ అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆదారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
- గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) చాలా కాలంగా సల్మాన్ ఖాన్ చంపుతానంటు బెదిరిస్తున్నారు. ఇందుకు సంబందించిన కారణాలు మాత్రం పూర్తిగా తెలియ రాలేదు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ కొంత కాలం క్రితం పంజాబీ సింగర్ సిద్దూ మూసే వాలాను పట్టపగలు దారుణంగా హత్య చేసిన కేసులో వెలుగులోకి వచ్చాడు. కాగా బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులకు తనదే బాధ్యత అంటూ ప్రకటించుకున్నాడు. తమ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు , ఇదే చివరి హెచ్చరిక అంటూ హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సల్మాన్‌కు రక్షణను మరింత పెంచారు. ఇపుడు వై ప్లస్ కేటగిరి భద్రతను పోలీసులు ఇస్తున్నారు. సీసీ టీవీలను పరిశీలించి ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
