CM YS Jagan
Published:
- – పూలు జల్లడం నిషేధం
– భద్రతలో భారీ మార్పులు
– సిద్ధమా అంటూ జగన్ ట్వీట్ - ఆకేరు న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM YS Jagan ) మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. దాడి ఘటన నేపథ్యంలో సీఎం భద్రతలో భారీ మార్పులు చేశారు. పలు జిల్లాలకు చెందిన డీఎస్సీలు సీఎం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
నిర్దేశించిన ప్రాంతాల్లోనే సభలు చేపట్టాలని నిర్ణయం. క్రేన్లతో గజమాలలు వేయకుండా నియంత్రణ. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు విధించారు. కాగా, కేసరిపల్లి నైట్ క్యాంప్ నుంచి జగన్ యాత్ర ప్రారంభమైంది. గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి క్రాస్, హునుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడుకు చేరుకుని భోజన విరామానికి ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జొన్నపాడు, జనార్ధనపురం మీదుగా సాయంత్రం గుడివాడకు చేరుకుంటారు. గుడివాడలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. దాడి తర్వాత జగన్ ఏం మాట్లాడనున్నారో అనేది ఆసక్తిగా మారింది. యాత్ర పునఃప్రారంభించనున్న నేపథ్యంలో కృష్ణాజిల్లా సిద్ధమా… అంటూ జగన్ ట్వీట్ చేశారు. - —————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
