ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
గంజాయి విక్రయంతోపాటు తాగుతున్న ఐదుగురు యువకుల బ్యాచ్ ని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు స్థానిక సీఐ జి. వేణు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బొమ్మ గళ్ళ శ్రీరామ్, ఆలేటి ఈశ్వరులు మహారాష్ట్ర లోని బలార్షాలో గుర్తు తెలియని వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసి మండల కేంద్రంలో వినియోగదారులకు విక్రయిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సైలు పిట్ట రాజేష్, రమేష్ లు బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన శ్రీరామ్, ఈశ్వరులను అదుపులోకి తీసుకుని విచారించగా బలార్షా నుండి తెచ్చిన గంజాయిని జాటోత్ రాజేష్, చెరిపెల్లి ప్రసాద్, మునిగల రాజేష్ లకు అమ్మగా వారు గాంజాయిని సేవించినట్లు తెలిపారు. పోలీసుల తనిఖీలు 50 గ్రాముల గాంజాయిని స్వాధీనం చేసుకొని శ్రీరామ్, ఈశ్వర్, రాజేష్, ప్రసాద్, రాజేష్ లను ప్రత్యేక వాహనంలో జనగామ కోర్టుకు తరలించినట్లు సిఐ వేణు తెలిపారు తెలిపారు.
