
* బడ్జెట్ రోజున లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతుండగా స్టాక్ మార్కెట్ (Stock Market)లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. శనివారం అయినప్పటికీ బడ్జెట్ సందర్భంగా ఈ రోజు మార్కెట్లు ట్రేడింగ్ (Trading) నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్న స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం, శనివారం లాభాల బాట పట్టాయి. బడ్జెట్ ప్రసంగం ముందు, ప్రారంభంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అయితే.. కాసేపటికి లాభాల నుంచి నష్టాల్లోకి చేరాయి. సెన్సెక్స్ (Sensex) 330 పాయింట్లు పడిపోయింది. 90 పాయింట్ల నష్టంలో నిఫ్టీ (NiFty) కొనసాగింది.
……………………………………