* స్టార్ ప్లేయర్ మెస్సీతో.. సీఎం మ్యాచ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోటీకి సై.. అంటే.. సై అంటూ.. మైదానంలో కాలు దువ్వారు సీఎం రేవంత్. నిత్యం బిజీగా ఉండే సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆడారు. క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి ఫుడ్‌బాల్ మైదానంలో సందడి చేశారు. దీంతో ఈ ఫొటో కాస్తా.. సామాజిక మాధ్యమంలో తెగ వైరలైంది. మెస్సీతో కలిసి సీఎం ఫుట్‌బాల్ ఆడనున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న మెస్సీకి అధికారులు, ప్రముఖ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెస్సీ టీంతో తలపడే జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్‌కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్లు రేవంత్ టీంలో ఆడనున్నట్లు సమాచారం.
…………………………………………………….
