* మాజీ ఐఎఎస్ బూసాని వెంకటేశ్వర రావు బిసి కమిషన్ ఛైర్మన్గా ఉత్తర్వులు
* నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర రావును ప్రభుత్వం ప్రత్యేక కమిషన్కు చైర్మన్గా నియమించింది. సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులును నియమించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లపై అధ్యయనం చేసి నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్లోª`ని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరిపారు. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను సవిూక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం బీసీల జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక కమిషన్ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
……………………………………………………..