* కేసీఆర్ బాటలోనే అప్పులు చేస్తున్న రేవంత్
* సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: కేసీఆర్, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (KISHAN REDDY) మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) రూ.7 లక్షల కోట్లమేర అప్పులు చేస్తే…రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి మరోమారు విమర్శించారు. గతంలో భారాస ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు.
రైతు భరోసా, రుణమాఫీ లేదు. పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. పైగా మహారాష్ట్రలో నిర్వహిస్తున్న ప్రచారంలో తెలంగాణ సస్యశ్యామలం అయిందంటూ మాట్లాడుతున్నారు. ఇంతకంటే అబద్దాలు ఉంటాయా? కాంగ్రెస్, భారాస తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. భాజపా నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తోందని… స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని భాజపా పోలింగ్ బూత్ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. మళ్లీ మండల స్థాయి వర్క్‌షాపులు ఉంటాయని.. ఈ నెల 22న దిల్లీలో జరగనున్న పార్టీ సంస్థాగత సమావేశాల్లో మండల, జిల్లా ఎన్నికల తేదీలు వస్తాయన్నారు.
…………………………………….