* పులివెందులలో రాజీనామా చేస్తే బ్యాలెట్ వాడదాం
* జగన్‌కు టీడీపీ కౌంటర్
ఆకేరు న్యూస్, విజయవాడ : ఎన్నికలు, ఈవీఎంల వాడకంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ (AP Former CM Jagan) సంచలన ట్వీట్ (Tweet) చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం (EVM) ల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్ (Jagan)చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్ల(Paper Ballots) ను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్(Tweet) చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్(x) వేదికగానే టీడీపీ(TDP), జనసేన(Janasena) కౌంటర్ ఇచ్చాయి.
151 సీట్లు వచ్చినప్పుడు గొప్పవన్నావు..
జగన్ ట్వీట్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ(YCP) కి 151 సీట్లు రావడం నిజం కాదా.. అని టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ప్రశ్నంచారు. అప్పుడు గొప్పవైన ఈవీఎంలు.. మాకు 154 సీట్లు రావడంతో అనుమానాలు వస్తున్నాయా అన్నారు. పులివెందు(Pulivendula) లలో రాజీనామా చేస్తే.. రానున్న ఉప ఎన్నికలో బ్యాలెట్ వాడాలని ఈసీ(EC)ని కోరదామని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వచ్చిన మెజార్టీ కూడా వస్తుందో లేదో చూద్దామన్నారు. విజయవాడ(Vijayawada) ఎంపీ (MP) కేశినేని చిన్ని(Keshineni Chinni) కూడా జగన్ (Jagan) ట్వీట్(Tweet) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ(Rushikonda) భవనాల ఉదంతం ఎన్నికలకు ముందే తెరపైకి వస్తే.. ఆ 11 సీట్లు కూడా రాకపోయేవని పేర్కొన్నారు.
———————-