
* శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ (Kasthuru Rangan) (84) కన్నుమూశారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. పీఎస్ ఎల్వీ(Pslv), జీఎస్ ఎల్వీ (Gslv) అభివృద్ధిలో రంగన్ కీలక పాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. జవహర్లాల్ విశ్వ విద్యాలయ చాన్సలర్ గా పనిచేశారు. 2003 నుంచి 2009 మధ్య రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ కె. కస్తూరిరంగన్ స్పేస్ కమిషన్ చైర్మన్(Space Chairman)గా, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. కాస్మిక్ ఎక్స్-రే మరియు గామా కిరణాల మూలాల అధ్యయనం, మరియు దిగువ వాతావరణంలో కాస్మిక్ ఎక్స్-కిరణాల ప్రభావంపై ఆయన గణనీయమైన కృషి చేశారు. అంతరిక్ష రంగంలో పరిశోధన, అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు.
……………………………………….