* భారత్, పాకిస్థాన్‌లకు ఐక్యరాజ్యసమితి సూచన
ఆకేరున్యూస్ : పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోంది. పౌరులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్-పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడికి ప్రతిగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ ఉద్రిక్తతల వేళ ఇరుదేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
