* నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ మంత్రి హరీశ్
ఆకేరున్యూస్, నాగర్ కర్నూల్ : జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు మంగళవారం వారి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చేరుకొని ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బాధలో ఉన్న లక్ష్మారెడ్డిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మెహన్ రెడ్డి, సురేందర్, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రజిని, ఇంతియాజ్, ఇతర నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
——————————–