Jakka Mahabub Reddy Extends Financial Aid
* నిరుపేదలకు అండగా మాజీ ఎంపిటీసి జక్కా మహబూబ్ రెడ్డి
ఆకేరు న్యూస్, తొర్రుర్: మండలంలోని మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటీసి, ప్రముఖ సామాజిక కార్యకర్త జక్కా మహబూబ్ రెడ్డి తన సేవా గుణంతో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల సోమనరసమ్మ ఇటీవల మృతి చెందగా విషయము తెలుసుకున్న తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్క మహబూబ్ రెడ్డి జక్క ఇంద్రసేనారెడ్డితో కలిసి శనివారం మృతురాలు గుండాల నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.3,000 మరియు 25 కేజీల బియ్యాన్ని ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జన్నపురెడ్డి రంగారెడ్డి ఇటీవల మృతిచెందగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ,3వేల 25 కేజీల బియ్యం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి, టపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా బాధిత కుటుంబాలను ఆదుకుంటానని భరోసా కల్పించారు.
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం. నిరుపేద కుటుంబాలకు సాయం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.
జక్కా మహబూబ్ రెడ్డి కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా, మండలంలోని గ్రామాలలో జరిగే ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఆర్థికంగా, నైతికంగా అండగా నిలుస్తున్న ఆయన సేవా నిరతిని గ్రామస్తులు, మండల ప్రజలు కొనియాడుతున్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ ధారావత్ విజయ రవి, ఉపసర్పంచ్ మొగుళ్లపల్లి లింగన్న గౌడ్, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, వెన్నం సోమిరెడ్డి, వల్లంల వెంకటేశ్వర్లు, నకిరేకంటి సంపత్, మహంకాళి సంపత్, ఎర్రము రాజు యాదవ్, గద్దల పరుశురామ్, వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
