Komatireddy Rajagopal Reddy Meets Bhatti Vikramarka
* బిల్లుల కోసమే భట్టిని కలిశా
* క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే సీనియర్ నేత కొండా మురళి భేటీ కావడం తీవ్ర రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ సమావేశం జరిగింది.
ఈ భేటీపై శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికే తాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్లు తెలిపారు. తాను ప్రజాభవన్‌కు వచ్చే సమయానికే అక్కడ కొండా మురళి ఉన్నారని, సాధారణ మర్యాదపూర్వకంగానే ఆయనను పలకరించానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నేతలు భట్టి విక్రమార్కతో వరుసగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే సమయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా అక్కడ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఇది కేవలం నియోజకవర్గ పనుల నిమిత్తం జరిగిన సాధారణ సమావేశమేనని రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
