* నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
* మంత్రి కొండ సురేఖ
ఆకేరున్యూస్, వరంగల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండ సురేఖ , శాసన మండలి ఉప సభాపతి శ్రీ బండా ప్రకాష్, కలెక్టర్ డాక్టర్ సత్య శారదా శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఖిలా వరంగల్ మండలం, ఉర్సు రంగలిలా మైదానం వద్ద జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చర్చించిన మీదట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
…………………………………..