* కార్మికులకు తక్కువ జీతం.. ఎక్కువ పనిచేయించడమే కారణం
ఆకేరు న్యూస్ డెస్క్ : స్విట్జర్లాండ్ (Switzerland)లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన భారతీయ సంతతి (Origin of India) కి చెందిన హిందుజా కుటుంబం (Hinduja family)లోని నలుగురి (Four Members) కి అక్కడి కోర్టు (Court) జైలు శిక్ష (Imprisonment) పడింది. వాళ్ల కుటుంబంలో పని చేస్తున్న భారతీయ సిబ్బంది(Indian staff) కి అతితక్కువ జీతం ఇవ్వడమే కాకుండా, ఎక్కువ పని చేయిస్తున్నారన్న ఆరోపణల మేరకు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
స్విస్ మీడియా కథనం ప్రకారం (According to a Swiss media report).. హిందుజా కుటుంబానికి చెందిన విల్లాలో పనిచేసే వారిలో ఎక్కువ మంది భారతీయు (Indian) లు ఉన్నారు. పారిశ్రామికవేత్త ప్రకాష్ హిందుజా (Prakash Hinduja), అతని భార్య, కొడుకు, కోడలు వారి సేవలను వినియోగించుకునేవారు. అయితే, వారికి హిందుజా ఫ్యామిలీ శునకాలకు వెచ్చిస్తున్న ఖర్చు కంటే తక్కువగా వేతనాలు చేల్లించారని వెలుగులోకి వచ్చింది. ఉద్యోగులను దోపిడీ (Extortion) చేయడం, అనధికారికంగా ఉపాధి కల్పించడం (Providing informal employment) వంటి నేరారోపణలు హిందూజ కుటుంబం (Hinduja family) ఎదుర్కొంది. అంతేకాకుండా భారతీయ సిబ్బంది పాస్‌పోర్ట్ (Passport) లను జప్తు చేసి, స్విస్ ఫ్రాంక్‌లకు బదులుగా భారతీయ కరెన్సీ (Indian currency) లో చెల్లిస్తున్నారని ఆరోపించారు. వారు విల్లా వదిలి వెళ్ళకుండా నిరోధించి, స్విట్జర్లాండ్ (Switzerland) లో చాలా తక్కువ డబ్బుతో ఎక్కువసేపు పని చేయించారని ప్రాసిక్యూషన్ (Prosecution) వాదించింది. దీంతో స్విస్ కోర్టు (Swiss Court)ఆ కుటుంబానికి చెందిన నలుగురికి జైలుశిక్ష విధించింది. భారతదేశ మూలాలను కలిగి ఉన్న హిందూజా కుటుంబం 1980ల చివరలో స్విట్జర్లాండ్‌లో స్థిరపడింది. హిందూజా గ్రూప్‌కు ఐటీ(IT), మీడియా (Media), విద్యుత్ (Electricity), రియల్ ఎస్టేట్ (Real Estate), హెల్త్‌కేర్ (Healthcare) వంటి రంగాల్లో వ్యాపారం ఉంది. ఫోర్బ్స్ ప్రకారం (According to Forbes) హిందూజా కుటుంబం మొత్తం సంపద దాదాపు 20 బిలియన్ డాలర్లు.
—————————–