
ఆకేరు న్యూస్, ములుగు: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమములో భాగంగా తాడ్వాయి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రణధీర్ , డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో పిల్లల వైద్య నిపుణులైన డాక్టర్ నవీన్ లు తాడ్వాయి మేడారం గంగారం సబ్ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని ఆరోగ్య సమస్యలు ఉన్న 1నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలను పరీక్షించి తగిన రక్త పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు అందించారు.అంతేకాక అత్యుత్తమ పరీక్షలు స్కానింగ్ , ఎక్స్ రే ల కొరకు ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేశారు, 313, వైద్య సేవలు అందించారు ఇందులో
86 మంది పిల్లలు, ఉన్నారు. ఈ సందర్భంగా రోగుల ఉద్దేశించి వైద్య అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని వైద్యశాలకు తరలించి వైద్య సేవలు పొందాలని సూచించారు . ఆస్పత్రిలో వైద్యులు, వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉంటూ 24 గంటలు సేవలందిస్తామని వివరించారు. తమ సేవలను రోగులు సద్వినియోగపర్చుకోవాలని కోరారు.
……………………………………………………..