Financial Assistance
Financial Assistance: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన బాల్య స్నేహితుడి కుటుంబానికి అతని స్నేహితులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం పామూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి రంజిత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
రంజిత్ 1988–89 ఎస్ఎస్సీ బ్యాచ్‌కు చెందిన స్నేహితుడు. ఆయన మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న తోటి మిత్రులు కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.33 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. రానున్న రోజుల్లోనూ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని స్నేహితులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రఘుతో పాటు పలువురు స్నేహితులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
