* సీనియర్ జర్నలిస్ట్ సుభాస్ అకస్మిక మృతి
* గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిశ్వాస
* 16 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్
ఆకేరున్యూస్,హనుమకొండ : సీనియర్ జర్నలిస్ట్ నాయకపు సుభాస్ ( 54 ) ఆకస్మికంగా మృతి చెందారు.. బ్యాక్ పెయిన్ తో ఆసుపత్రి కి వెళ్లిన సుభాస్ కు చికిత్స కొనసాగుతుండగానే గుండె పోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.. హుటా హుటిన దగ్గరలో ఉన్న అజర హాస్పిటల్ కు తరలించారు..అక్కడ అత్యవసర చికిత్స అందించారు.. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాసివ్ గా వచ్చిన గుండెపోటు వల్ల ఆసుపత్రి కి చేరుకునే టప్పటికే మృతి చెందారని అజర ఆసుపత్రి వైద్యులు చెప్పారు. భీమారం గ్రామానికి చెందిన సుభాస్ కు భార్య జ్యోతి ,కుమారుడు శ్రీ చంద్ ఉన్నారు.. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరుగుతాయని బంధువులు తెలిపారు.
* అందరి బంధువు సుభాస్..
మృదు స్వభావి.. అందరిని చిరునవ్వుతో పలకరించే సుభాస్ కు అందరి వాడన్న పేరున్నది ..అందుకే ఆయన మరణ వార్త తెలియగానే పెద్ద ఎత్తున జర్నలిస్ట్ లు అజర ఆసుపత్రి కి చేరుకున్నారు. కన్నీళ్లతో జర్నలిస్ట్ లు జోహార్లు అర్పించారు.. మిత్రులారా ..ఇక సెలవంటూ మమ్మల్ని విడిచి వెళ్లావా రోదించారు. 16 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో రిపోర్టర్ గా కొనాసాగుతున్నాడు . అనేక అంశాలకు సంబంధించి ఎన్నో వార్తా కథనాలు రాసి పలువురి ప్రశంసలు పొందారు.
* జర్నలిస్ట్ యూనియన్ నేత
సుభాస్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా కొనసాగుతున్నాడు.తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ – 143 హనుమకొండ జిల్లా కార్యదర్శి గా జర్నలిస్ట్ ల సమస్యల కోసం జరిగిన ఆందోళనల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. జర్నలిస్ట్ ల పరపతి సంఘం బాధ్యుడిగా కొనసాగుతున్నాడు..
———