Gachibowli RMP Doctor Attacks Police
* హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గచ్చిబౌలిలో పోలీసులపై RMP డాక్టర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 112కు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్‌పై RMP డాక్టర్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
*ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన పోలీసులు..
పోలీసుల వివరాల ప్రకారం.. నానక్‌రామ్‌గూడలోని అపోలో ఆసుపత్రి సమీపంలో 112కు ఫిర్యాదు రావడంతో హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ అక్కడికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో RMP డాక్టర్‌తో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
* ఫోన్ నేలకేసి కొట్టి.. పిడిగుద్దులు..
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో RMP డాక్టర్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ఫోన్‌ను నేలకేసి కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది కాలర్ పట్టుకుని ముఖంపై పలుమార్లు పిడిగుద్దులు గుద్దినట్లు తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని వరంగల్ పట్టణంలోని ఉషా క్లినిక్‌లో RMP డాక్టర్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ (36)గా గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
