* బ్యానర్లు, బారీకేడ్లు తొలగింపు
* వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకుంటే రేపు నగరవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయకపోవడంపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జన నిషిద్ధం అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసింది. బారీకేడ్లను తొలగించింది. ఈ క్రమంలో వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేస్తుండడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఉత్సవ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022, 2023లో కూడా ఇలాగే చేశారని, చివరకు ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌ఫై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేస్తామన్నారు.
————————