
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇప్పుడో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఇది ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ ఒప్పందానికి రావాలంటూ ప్రధాని మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి సైతం ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ధృవీకరించలేదు. సోమవారం ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందానికి వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు. దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్, తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం సంభవించింది. అయితే గాజాగా ఈ యుద్ధాన్ని ముగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. కాగా, ఆ సమావేశానికి మోదీ (Modi) వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
……………………………………….