* చంద్రబాబు అభ్యర్థనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఐపీఎస్ కేడర్ పెంచుతూ (IPS Cadre Increase) కేంద్ర ప్రభుత్వం (Central Government) గెజిట్ నోటిఫికేషన్ విడుదల (Releases Gazette Notification) చేసింది. దీంతో కొత్తగా మరో 30 మంది ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ప్రస్తుతం ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ 144గా ఉంది. అయితే దీనిని పెంచాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ 174కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం (YCP government) హయాంలో వైఎస్ జగన్ (YS Jagan) జిల్లాల సంఖ్యను పెంచారు. దీంతో పెరిగిన జిల్లాలకు నూతన ఎస్పీలు (SPs), క్రైమ్ (Crime), నిఘా విభాగాలు (Surveillance departments) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అవసరమైన సంఖ్యలో ఏపీ (AP) లో ఐపీఎస్ అధికారులు లేకుండా పోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు ఏపీలో ఐపీఎస్ అధికారుల కొరతను గుర్తించారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు.. ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తో చర్చించారు. ఐపీఎస్ అధికారుల కొరత కారణంగా జూనియర్ ఐపీఎస్ అధికారులనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తోందని అమిత్ షాకు వివరించారు. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని అమిత్ షాను కోరారు. చంద్రబాబు అభ్యర్థనకు స్పందించిన హోం మంత్రి అమిత్ షా.. ఏపీ ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
—————–