
తిరుపతిలో స్నేహితురాలిని భర్తతో రేప్ చేయించిన భార్య
* డబ్బు కోసం భార్యాభర్తల అఘాయిత్యాలు
* గతంలో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ భర్త
* గంజాయి అమ్మకాలు ఆపేసి భార్యతో దారుణాలు
* భర్త కోసం యువతులకు గంజాయి అలవాటు చేసిన భార్య
* బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తల అరెస్ట్
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుపతి (Tirupati) లో ఓ దంపతుల అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం వారు చేస్తున్న వికృత చేష్టలు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతికి చెందిన కృష్ణ కిశోర్ రెడ్డి (Krishna Kishore Reddy), ప్రణవ (Pranava) భార్యాభర్తలు. గతంలో గంజాయి (Marijuana) అమ్ముతూ కిశోర్ పట్టుబడ్డాడు. ఆ తర్వాత గంజాయి అమ్మకాలు ఆపేసి భార్యతో దారుణాలు చేయించడం మొదలుపెట్టాడు. భర్త కోసం అమ్మాయిలను గంజాయి మత్తులో దించి అతడితోనే అత్యాచారం చేయించేది ప్రణవ. తెలిసిన అమ్మాయిలతో స్నేహం చేసి ముగ్గులోకి దింపి గంజాయి అలవాటు చేసేది. ఈక్రమంలోనే గంజాయి మత్తులోఉన్న స్నేహితురాలిపై భర్తతో అత్యాచారం చేయించింది. ఆ ఘటనను వీడియో తీసి బెదిరింపులు మొదలుపెట్టింది. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియో ఆమె కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించేది. ప్రణవ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో గతంలో ఓ యువతి నుంచి ప్రణవ రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
————————