* తెలంగాణకు చుక్కనీరు ఉండదు
* కర్ణాటక సీఎం తో మాట్లాడే ధైర్యం రేవంత్ కు లేదు
* మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఓ పక్క గోదావరి నీళ్లను ఏపీ, మరో పక్క కృష్ణా నీటిని కర్ణాటక తీసుకుపోతే తెలంగాణకు చుక్క నీరు మిగలదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు
శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పక్కనున్న రెండు రాష్ట్రాలు నీటిని దోచుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పరామర్శించడానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంతో ఆల్మట్టి డ్యాం గురించి మాట్లాడుతారని ఊహించామని కానీ రేవంత్ మాట్లాడలేదని అన్నారు. కర్ణాటక సీఎంతో మాట్లాడే ధైర్యం రేవంత్‌కు లేదని ఆరోపించారు.కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రాహుల్ గాంధితో కర్ణాటక సీఎంకు ఫోన్ చేయించి ఆల్మట్టి డ్యాం ఎత్తు గురించి మాట్లాడించవచ్చు కదా అని అన్నారు.రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదు.. తెలంగాణ బాగోగుల గురించి కూడా ఆలోచించాలి అన్నాడు..ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది.. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది. 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు.. ఆ నల్లమలను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా.. ఎందుకు మాట్లాడటం లేదు. పులి అయితే మాట్లాడేవాడివి.. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు.
…………………………………….
