* సెక్యూరిటీ లేకుండా రూ. 23 కోట్ల విలువైన సొత్తు రవాణా
* శంషాబాద్ రోడ్డులో పోలీసుల తనిఖీలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, నగలు, ఇతర సామగ్రి పట్టుబడుతున్నాయి. తాజాగా పోలీసులు 35 కేజీల బంగారాన్ని , 43 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 23 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తరలిస్తుండడంతో పోలీసులు అవాక్కయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు ముంబైకి చెందిన నాప్ లాగ్ లాజిస్టిక్స్ వెహికల్ ను ఆపారు. అందులో పరిశీలించగా 34.78 కేజీల బంగారం, 43.60 కేజీల వెండి గుర్తించారు. వాటిని హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్నారు. సరైన సెక్యూరిటీ లేకుండా, సరైన పత్రాలు లేకుండా అంత విలువైన సొత్తు తరలిస్తుండడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారు.
———————