* 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,900
* రూ.3 లక్షలకు చేరుకున్న కిలో వెండి ధర
ఆకేరున్యూస్, హైదరాబాద్: బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించకున్నా కొంతమేర దిగివస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,530కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 9,050 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 8,300 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,680కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,050కి చేరుకుంది. మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా వేగంగా పతనమవుతోంది. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.50 వేల మేర తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది.
……………………………………………
