* విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్
ఆకేరు న్యూస్, డెస్క్:తెలంగాణలో జరగనున్న 116 మున్సిపల్ 7 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ ఓటర్లకు, అభ్యర్థులకు కీలక విజ్ఞప్తి చేశారు. మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు తావులేకుండా ,జ్ఞాన తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం లక్ష్యంగా తమ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయాలని, ఎన్నికలు సాగాలని ఆయన ఆకాంక్షించారు.పోటీ చేసే అభ్యర్థులు తమ వార్డుల్లో గ్రంథాలయాల ఏర్పాటును ప్రధాన హామీగా చేర్చాలి అని, గెలిచిన తర్వాత కమ్యూనిటీ హాళ్లు లేదా పార్కుల్లో వీటిని నెలకొల్పాలి. మనం చెల్లించే ఆస్తి పన్నులో గ్రంథాలయ సెస్సు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఓటు అడగడానికి వచ్చే అభ్యర్థులను తమ వార్డులో లైబ్రరీ ఏర్పాటు గురించి ప్రశ్నించాలి అన్నారు . గ్రంథాలయాలు ఏర్పాటు చేసే కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లకు తమ ఫౌండేషన్ తరపున ఉచితంగా పుస్తకాలు, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని శ్రీనివాస్ ప్రకటించారు.వార్డు అభివృద్ధిలో భాగంగా విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చే వారికే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు 9010324446 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
