
* సీబీఐ విచారణపై బండి సంజయ్
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాళేశ్వరం ప్రాజెక్టు(KALESHWERAM PROJECT)లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణను కోరుతూ రాష్ట్రప్రభుత్వం చేసిన సిఫారసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (BANDI SANJAY) హర్షం వ్యక్తం చేశారు, ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పార్టీ ఎప్పటి నుండో సిబీఐ విచారణ కోరుతోందని సీబీఐకు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. చివరి కాంగ్రెస్ ప్రభుత్వం సత్యానికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని బండి పేర్కొన్నారు.కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ ఎస్ బాధ్యత వహించాలన్నారు. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతంకాని రోజువారీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
…………………………………………..