* కారుణ్య నియామక ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు
* హామీ అమలులో ముందడుగు వేసిన రేవంత్ సర్కారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సింగరేణి(Singareni ) కారుణ్య నియామక (Compassionate appointment) ఉద్యోగార్థులకు శుభవార్త తెలిపారు. వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు సింగరేణి వెల్లడించింది. అధికా రంలోకి వచ్చిన వెంటనే సింగరేణి అభివృద్ధిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సమీక్ష నిర్వహించారు. సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలంటూ సింగరేణి సీఎండీ బలరాం నాయక్ (Balram Naik) ను ఆదేశించారు. ఇందులో 168 పోస్టులు అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది 1000 మందికి సింగరేణిలో కారుణ్య నియామకాలు కల్పిస్తామని తెలిపారు. వారసులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల్లో వారసుల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా అది అమల్లోకి రావడంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
——————-