* 50 కేజీల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఫ్రీ
* ఎక్స్ వేదికగా పవన్‌కల్యాణ్ వెల్లడి
ఆకేరు న్యూస్, అమరావతి : మొంథా తుపాను ప్రభావంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీళ్లు చేరి నిత్యాసవరాలు సైతం పాడైపోయాయి. మరోవైపు మత్య్సకారుల జీవనోపాధి దెబ్బతింది. అలాగే చేనేత ఇతర కార్మికులకూ నష్టం వాటిల్లింది. ఈక్రమంలో ఏపీ ప్రభుత్వం వారి అండగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈమేరకు అవసరమైన నిత్యావసరాలను అధికార యంత్రాంగం సమకూర్చింది. బియ్యం 25 కేజీలు (మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కేజీలు), కందిపప్పు కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు కేజీ, బంగాళాదుంపలు కేజీ, పంచదార కేజీ చొప్పున అందిస్తారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పౌర సరఫరాల శాఖ మంత్రి వీటిని సమకూర్చే పనిలో ఉన్నారు. ఆ శాఖ అధికార యంత్రాంగం అన్ని రేషన్ షాపులకు వీటిని చేర్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3,424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వీటిని ఉచితంగానే అందించనున్నారు. కూరగాయలు, ఉల్లిపాయల సరఫరా నిరంతరంగా సాగేందుకు మార్కెటింగ్ కమిషనర్ పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని సూచించించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
…………………………………………………..
