* ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్‌తో చిక్కుల్లో గౌతమి!
ఆకేరు న్యూస్,ఖమ్మం: సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చేసిన పని ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రైవేట్ సంస్థలకు ప్రచారం కల్పించారనే ఆరోపణలతో విద్యాశాఖ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది.ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో గౌతమి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ, ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇటీవల ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ప్రమోషనల్ వీడియోలు చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, పోటీగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం సర్వీస్ రూల్స్ ప్రకారం నేరమని భావించిన విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్ వేటు పడటంతో గౌతమి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.”నేను చేసిన చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్షా?” అని ప్రశ్నిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అధికారుల చర్యల వల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని ఆమె ఆ వీడియోలో పేర్కొనడం కలకలం రేపింది.విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైన వాణిజ్య ప్రకటనల్లో నటించకూడదు మరియు ప్రైవేట్ సంస్థల నుండి లాభాలను ఆశించి ప్రచారాలు చేయకూడదు. గౌతమి నేరుగా ప్రైవేట్ స్కూల్‌ను ప్రమోట్ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.”నియమ నిబంధనలు అందరికీ ఒకటే, బాధ్యత గల టీచర్ అలా చేయకూడదు” అని అంటుంటే.. మరికొందరు మాత్రం “సస్పెన్షన్ అనేది చాలా పెద్ద శిక్ష, హెచ్చరికతో వదిలేయాల్సింది” అని అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై స్పష్టమైన నియమాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించినప్పుడు చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, ఈ అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
……………………………………………..
