మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం…
ఆకేరు న్యూస్, డెస్క్:గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మక్తల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో జెండా కర్ర ఒక్కసారిగా విరిగి పడిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జెండాను ఆవిష్కరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జెండా తాడును లాగుతున్న సమయంలో కర్ర ఒక్కసారిగా విరిగి కిందకు పడిపోయింది. అయితే, మంత్రికి అత్యంత సమీపంలోనే కర్ర పడినప్పటికీ, ఆయన త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. దీంతో అక్కడున్న అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.ఈ అనుకోని ఘటనలో అక్కడ విధుల్లో ఉన్న ఒక వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది బాధితుడిని చికిత్స నిమిత్తం తరలించారు.గణతంత్ర వేడుకల వంటి పవిత్రమైన సందర్భంలో ఇలాంటి అపశ్రుతి చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
