* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసీ ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పరిధిలోని 12 జిల్లాలు అయిన సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండలో 605 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, పోలింగ్ సందర్భంగా ఈనెల 27న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఈసీ 27న సెలవు ప్రకటించింది.
——————