* పోలింగ్ శాతం పెరిగే అవకాశం
* ఓటేసిన ప్రముఖులు
* మొత్తం ఓటర్లు – 4,63,839
ఆకేరు న్యూస్ , వరంగల్ : నల్గొండ, వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందో బస్త్ ఏర్పాటు చేశారు. . ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే ఈ పోలింగ్‌లో ఉదయం నుంచే గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.నల్గొండ జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, హనుమకొండలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు , తొర్రూర్‌లో పాలకుర్తి యశస్విని రెడ్డి , సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూన్ 5న ఫలితాలు
ఈ రోజు జరుగుతున్న ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ లు పోటీ చేస్తున్నారు. నల్గొండ, వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4,63,839 ఓటర్లు ఉన్నారు. కాగా ఈ ఎన్నిక ఫలితాలు జూన్ 5న వెలువడనున్నాయి.
——————————–