* జూన్ 1 నుంచి 11 వరకు బడి బాట
* ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు
* హై స్కూల్స్ యథావిదిగా 9 గంటలకే
* ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే
* అకడమిక్ కేలండర్ ప్రకటించిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. 12 వ తేదీ నుంచి యధావిదిగా పాఠశాలలు కొనసాగుతాయి. పాఠశాలల పని వేళలను కూడా మార్చారు. సాధారణంగా ఉదయం 9గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి మాత్రం ఉదయం 9 గంటలకే ప్రారంభిస్తున్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం అకడమిక్ కేలండర్ను ప్రకటించింది.
జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పకడ్బందిగా అకడమిక్ కేలండర్ను రూపొందించింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా అధికారులు అడుగులు కదిపారు. పనిదినాలు, సెలవులు, పరీక్షల నిర్వహణ , ఆటల పోటీలకు సంబందించి ప్రత్యేకంగా కేలండర్ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదవుతోందని నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి 90 శాతం విద్యార్థుల హాజరు ఉండే విదంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు, విద్యాకమిటీలు, స్వయం సహాయక సంఘాలు , స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.నెలలో ప్రతీ మూడో శనివారం మాత్రం నో బ్యాగ్ డే గా పాటించాలి. ఇదే రోజున పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి.
ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమయి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు పనిచేస్తాయి. గతంలో ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యేవి. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9. గంటల 30 నిమిషాలకు మొదలై సాయంత్రం 4. గంటల 15 నిమిషాల వరకు పనిచేస్తాయి. హైదరాబాద్ జంట నగరాలకు మాత్రం ప్రత్యేక పనివేళలను రూపొందించారు.
————————————–