* ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC by election) కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ గెలుపు తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్ల పరిశీలనలో సిబ్బంది ఉన్నారు. తొలిరౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 7,670 ఓట్ల మెజార్టీ సాధించగా రెండో రౌండ్లోనూ ఆధిక్యతను కనబరిచారు. 14,672 ఓట్ల మెజార్టీకి చేరారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 3 గంటలక వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలుకట్టడానికే సరిపోయింది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ వాడారు. ఇది కూడా కౌంటింగ్ లేట్ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీకి కౌంటింగ్ కు సంబంధించి గురువారం సాయంత్రానికి కూడా ఫలితం వచ్చేది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కవ ఎవరికి వస్తే వారు విజయం సాధించినట్లు అవుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ గౌడ్ పోటీ చేశారు. ఒక్కో రౌండ్లో 96 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆఖరి రౌండ్ లో మాత్రం 48,013 ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.
———————-