* మాజీ మంత్రి హరీష్రావు
ఆకేరున్యూస్, సిద్దిపేట: ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిరచాలని హరీష్రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు మర్చిపోయావని నిలదీశారు. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అంటూ మండిపడ్డారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని స్పష్టం చేశారు.
……………………………………